Beauty Tips : బియ్యం కడిగిన నీటితో గ్లాసీ స్కిన్.. ఎలా సాధ్యమంటే..

by Javid Pasha |
Beauty Tips : బియ్యం కడిగిన నీటితో గ్లాసీ స్కిన్.. ఎలా సాధ్యమంటే..
X

దిశ,ఫీచర్స్ : ఉన్నంతలో తాము అందంగా, అట్రాక్టివ్‌గా కనిపించాలని అందరూ అనుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖంపై ముడతలు, మచ్చలు పోవడానికి, నిగనిగలాడటానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. అయితే అలాంటి అవసరం లేకుండా కేవలం బియ్యం కడిగిన నీళ్లను అప్లై చేసినా కొరియన్ లాంటి గ్లాసీ స్కిన్ మీ సొంతం అవుతుందని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదెలా సాధ్యమో చూద్దాం.

బియ్యం కడిగిన నీళ్లల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు ఫెరులిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వీటిని చర్మానికి పట్టించి కడగడం వల్ల కాంతివంతంగా మారుతుంది. అట్లనే ఎగ్జిమా, మొటిమలు, దద్దుర్లు వంటివి తగ్గుతాయి. అమైనో యాసిడ్స్, మినరల్స్ ఉండటం కారణంగా బియ్యపు నీళ్లు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా మాయిఖ్చరైజింగ్ గుణాలు ఉండటంవల్ల చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో నేచురల్ టోనర్‌గా పనిచేస్తాయి. వృద్ధాప్య ఛాయలను దూరం చేసి ముఖంపై యవ్వన ఛాయలను పెంచడంలో సహాయపడతాయి.

*నోట్:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed