ప్రకృతి ఒడిలో సిలువ పొదరిల్లు

by Naveena |
ప్రకృతి ఒడిలో సిలువ పొదరిల్లు
X

దిశ, అలంపూర్ : విద్యుత్ స్తంభానికి ఓ పచ్చని తీగ ఎంతో అందంగా అల్లుకుపోయింది. అచ్చం క్రిస్మస్ పండుగ సిలువలా చుట్టేసింది. ఈ దృశ్యం జోగులంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని గోకులపాడు గ్రామానికి వెళ్లే దారిలో కనిపించింది. అటుగా వెళ్లే ప్రయాణికులను ఎంతో ఆకట్టుకుంది. క్రిస్మస్ పండుగకు ఆహ్వానించే విధంగా విద్యుత్ స్తంభానికి తీగ అల్లుకొని..ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరంగా కనిపించింది. అచ్చం సిలువ మాదిరే కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Advertisement

Next Story

Most Viewed