విజయనగరం జిల్లాలో రెండు బైకుల ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్

by srinivas |
విజయనగరం జిల్లాలో రెండు బైకుల ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా గంట్యాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలాని పరిశీలించిన మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇదిలా ఉంటే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం లక్ష్మీ నగర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఏలూరు ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈనెల 6 తేదీన సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్‌కు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ద్వారకా తిరుమల మండలం లక్ష్మీ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఘటనా స్థలంలోనే భాగ్యశ్రీ, ఆమె తల్లి కమలాదేవి, పెద్ద కుమారుడు నాగ నితిన్ కుమార్ మృతి చెందారు. డ్రైవర్ దుర్గా వంశీ, భాగ్యశ్రీ చిన్న కుమారుడు నాగ షణ్ముక్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హుటాహుటిన ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ప్రమాద ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

Advertisement

Next Story