Hardik: నువ్వే నా ప్రపంచం.. లవ్ యు సోమచ్.. హార్దిక్ పాండ్యా ట్వీట్ వైరల్

by Indraja |   ( Updated:2024-07-05 06:50:17.0  )
Hardik: నువ్వే నా ప్రపంచం.. లవ్ యు సోమచ్.. హార్దిక్ పాండ్యా ట్వీట్ వైరల్
X

దిశ వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ సాధించి భారతీయుల చిరకాల వాంఛను తీర్చిన టీమ్ ఇండియా తిరిగి ఇండియాకు వచ్చింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ముంబైలో అభిమానుల ఘణ స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌కు తన మనసులోని మాటలను జోడించారు.

‘భారతదేశం నువ్వే నా ప్రపంచం. ప్రేమను పంచుతున్న అభిమానులందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. వర్షం పడుతున్నా, ఆ వర్షాన్ని లెక్క చేయకుండా ఈ విజయ వేడుకలను మాతో కలిసి జరుపుకోవడానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.We love you so much. ఇక్కడ 1.4 బిలియన్ ఉన్నాం, మనం అందరం ఛాంపియన్లమే. ధన్యవాదాలు ముంబై, ధన్యవాదాలు భారతదేశం’ అంటూ రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed