నిరుద్యోగులకు భారీ షాక్.. మెట్రోలోకి ‘నో’ ఎంట్రీ..!

by Anjali |
నిరుద్యోగులకు భారీ షాక్.. మెట్రోలోకి ‘నో’ ఎంట్రీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు నిన్న దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. కాగా నిన్న పాఠశాలలు, కళాశాలలన్ని తెరచుకోలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇవాళ కూడా ధర్నా కొనసాగించారు. TGPSC వైపు వెళ్లేందుకు బీఆర్ఎస్‌వీ విద్యార్థుల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్ కు తరలించారు. బాహుబలి రేంజ్‌లో TGSPSCకి భారీ కంచెలతో భద్రత ఏర్పాటు చేశారు. పోలీసుల తోపులాటలో ఓయూ విద్యార్థి తలకు గాయం కూడా అయింది. అయితే నిరుద్యోగుల TGSPSC ముట్టడి నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ మెట్రో దగ్గర పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరుద్యోగులను మెట్రోలోకి అనుమతించడం లేదు. దిల్‌సుఖ్‌నగర్ మెట్రో వద్ద ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సప్ ఓపెన్ చేసి చెక్ చేశాకనే పోలీసులు మెట్రోలోపలికి అనుమతిస్తున్నారు. టీజీఎస్పీసీని ముట్టడించి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్‌వీ కార్యకర్తలు, నిరుద్యోగుల ధర్నాను పోలీసులు ఎంతగా అడ్డుకున్నా ఇవాళ ఆగేలా కనిపించడం లేదు.

Next Story