పీడీఎస్ దందా.. అడ్డగోలుగా ఆంధ్రాకు తరలింపు

by srinivas |
పీడీఎస్ దందా.. అడ్డగోలుగా ఆంధ్రాకు తరలింపు
X

ప్రభుత్వం పేదలకు ప్రతినెల అందించే రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. అయితే కొందరు డీలర్లే పెద్దఎత్తున పీడీఎస్ బియ్యం అక్రమ దందాగా పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టించి అక్రమార్జన పొందేందుకు చూస్తున్నారు. గతంలో రేషన్ బియ్యం దందా కొందరు రాజకీయ నాయకుల కనుసైగల్లోనే నడిచేదనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ దందా అంతా రేషన్ డీలర్ల ఆధ్వర్యంలోనే సాగుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల కింద హుజూర్‌నగర్ గోదాం నుంచి ఒక లారీ ద్వారా 22టన్నులను ఆంధ్రాకు తరలిస్తుండగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ రేషన్ బియ్యం హుజూర్‌నగర్ నుంచి తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ దందాకు రేషన్ డీలర్లతోపాటు దాని కాంట్రాక్టర్ అందులో పని చేసే ఆర్ఐ ప్రధాన ముద్దాయిలుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేసి జైలుకు పంపించారు. ఈ ఘటనే హుజూర్‌నగర్‌లో రేషన్ డీలర్ల దందా ఏ విధంగా సాగుతుందో అర్థమవుతోంది. అధికంగా హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల నుంచి ఈ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. ఈ రేషన్ బియ్యాన్ని మట్టపల్లి బ్రిడ్జి మీదుగా దాచేపల్లికి, అలాగే జాన్ పహాడ్ మీదుగా దామరచర్లకు అక్కడినుంచి ఆంధ్రాకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

- దిశ, హుజూర్‌నగర్

దిశ, హుజూర్‌నగర్: ప్రభుత్వం పేద ప్రజలకు ఆహారం కొరత లేకుండా ప్రతినెల రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా అందిస్తోంది. కానీ కొందరు డీలర్లు పీడీఎస్ బియ్యం అక్రమ దందాగా పాల్పడుతున్నారు. ప్రజలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టించి తమ లాభాలను పొందేందుకు చూస్తున్నారు. గతంలో రేషన్ బియ్యం దందా కొందరు రాజకీయ నాయకుల కనుసైగల్లోనే నడిచేదనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఈ దందా అంతా రేషన్ డీలర్ల ఆధ్వర్యంలోనే సాగుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల కింద హుజూర్‌నగర్ గోదాం నుంచి ఒక లారీ ద్వారా 22 టన్నులను ఆంధ్రాకు తరలిస్తుండగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ రేషన్ బియ్యం హుజూర్‌నగర్ నుంచి తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ దందాకు రేషన్ డీలర్లతోపాటు దాని కాంట్రాక్టర్ అందులో పని చేసే ఆర్ఐ ప్రధాన ముద్దాయిలుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేసి జైలుకు పంపించారు. ఈ ఘటనే హుజూర్‌నగర్‌లో రేషన్ డీలర్ల దందా ఏ విధంగా సాగుతుందో అర్థమవుతోంది. గతంలో ఈ రేషన్ దందా అంతా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జరిగేదని, కాని ప్రస్తుతం దందా అంతా హుజూర్‌నగర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది.

దందా ఇలా..

ప్రభుత్వం ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారుల ద్వారా ప్రతినెలా పంపిణీ చేస్తారు. అయితే సివిల్ సప్లై అధికారులు ఆ రేషన్ షాపుల కార్డులను బట్టి ఏషాపునకు ఎంత రేషన్ బియ్యం అందించాలో ఆ షాపులకు గోదాంలో కాంటా వేసి లారీల ద్వారా డీలర్లకు అందజేస్తారు. అయితే ఈ రేషన్ బియ్యాన్ని అక్కడ ఉన్న కార్డుదారులకు డీలర్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. రేషన్ బియ్యాన్ని కార్డు ఉన్న వాళ్లంతా రేషన్ బియ్యం తీసుకపోకపోవడం, అలాగే రేషన్ బియ్యం తినలేనివారు ఆ బియ్యాన్ని డీలర్లకే కేజీకి రూ.5నుంచి రూ.10కు విక్రయిస్తారు. అయితే డీలర్లకు ప్రతినెలా ఎంత కోటా సరిపోతుందో ముందస్తుగానే గుర్తించడంతో ఆ మిగులు బియ్యాన్ని రేషన్ షాపులకు రాకుండానే డీలర్లు గోదాం వద్ద ఉన్న అధికారులను మెయింటైన్ చేసి అక్కడే నిల్వచేసి లారీల ద్వారా రాత్రివేళలో ఆంధ్రా ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.

అధికారుల హస్తం..!?

ఈ రేషన్ బియ్యం దందాలో అధికారుల హస్తం కూడా ఉన్నట్లు వినికిడి. ప్రతిరోజు రాత్రివేళలో పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులకు ఈ అక్రమ దందా బియ్యం లోడుతో వెళ్తున్న లారీలు కనిపించడం లేదా? అని స్థానిక ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే హుజూర్‌నగర్ సర్కిల్లోని ఓ పోలీస్ స్టేషన్‌కు రేషన్ బియ్యం దందా చేసే వ్యక్తులు ప్రతినెల సుమారు రూ.లక్ష వరకు మామూలు ఇస్తున్నట్లు వినికిడి. అయితే దీని వెనుక ఓ పోలీస్ అధికారి హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజుల కింద దామరచర్లలో పట్టుబడిన లారీ గోదాం నుంచి సాయంత్రం బయటికి వెళ్లి అది హుజూర్‌నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల మీదుగా తెల్లవారుజామున 3గంటల సమయంలో నల్గొండ జిల్లా దామరచర్ల వెళ్లగా అక్కడ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ మండలాల మీదుగా వెళ్లినా ఇక్కడ పోలీసులను దాటుకుని ఎలా వెళ్లిందనే చర్చ జరుగుతోంది. ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టుకోరనే ఉద్దేశంతోనే నల్గొండ జిల్లా పోలీసులు సమాచారం ఇచ్చారనే చర్చ నడుస్తోంది.

దాచేపల్లి కేంద్రంగా దందా...

రేషన్ బియ్యానికి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పల్నాడు జిల్లా దాచేపల్లి కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలోని పిడుగురాళ్లకు చెందిన వెంకటేశ్వర్లు, నరసింహారావు, కల్లూరు లింగయ్య అనే వ్యక్తులు ప్రధాన సూత్రధారులుగా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. వీరిపై ఇప్పటికే చెప్పలేన్నని కేసులు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైనట్లు సమాచారం. వీరికి దాచేపల్లి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ప్రజాప్రతినిధి అండదండలతోనే ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి అక్రమ దందాను ఆపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినా ఆగే పరిస్థితి లేదు. గతంలో వీరిని పట్టుకునేందుకు వెళ్లిన సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు సంబంధించిన పోలీసులపై కూడా వీరు దాడులు చేసిన సంఘటనలు కోకొల్లలు.

మట్టపల్లి బ్రిడ్జి.. లేదంటే జాన్ పహాడ్ మీదుగా..

అత్యధికంగా హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల నుంచి ఈ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. ఈ రేషన్ బియ్యాన్ని కోదాడ నుంచి లారీల ద్వారా మేళ్లచెరువు మీదుగా మఠంపల్లి, అక్కడినుంచి మట్టపల్లి బ్రిడ్జి మీదుగా దాచేపల్లికి అలాగే హుజూర్‌నగర్ ప్రాంతంలోని చింతలపాలెం, మేళ్లచెరువు, మఠంపల్లి మండలాలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని మఠంపల్లి బ్రిడ్జి మీదుగా నేరేడుచర్ల, పాలకవీడు మండలాలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని లారీల ద్వారా రాత్రివేళలో జాన్ పహాడ్ మీదుగా దామరచర్లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed