NTR: రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్

by Prasanna |   ( Updated:2024-10-06 12:20:12.0  )
NTR: రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : రాజమౌళితో ఏ హీరో మూవీ చేసిన ఆ తర్వాత మూవీ కచ్చితంగా ఫ్లాప్ అవుతుందనే ఎప్పటి నుంచో ఈ టాక్ నడుస్తుంది. రాజమౌళి మొదటి మూవీ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి కూడా అంతే. జక్కన్నతో తీసిన ప్రతి హీరోకి ఆ తర్వాత మూవీ ఫ్లాప్ అనేస్తారు. కొంతమందికి అయితే ఒకేసారి రెండు, మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అలాగే ఫీల్ అయ్యేవాళ్ళు. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత దేవరతో పెద్ద హిట్ కొట్టి రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ ని చెరిపేశాడని అనడం మొదలు పెట్టారు. అసలు ఆ సెంటిమెంట్ మొదలైంది ఎన్టీఆర్ తోనే. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా దీని గురించి చెబుతూ ట్వీట్ వేయడం గమనార్హం.

అయితే, తాజాగా ఎన్టీఆర్ దీనిపై స్పందించాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. " మనం సినిమాలు సరిగా తీయలేక, రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ మూవీ పోతుందని జక్కన్న మీదకి తోసేసాం. మనకి చేతగాక క్రియేట్ చేసుకున్న టాక్ ఇది " అన్నారు. దీంతో, ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ ఇలా అనడంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరూ ఇప్పుడు దీని గురించే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

Advertisement

Next Story