ఇలాంటి వారు చాలా ప్రమాదకరం.. అతడిని వదిలిపెట్టనంటూ మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్

by Hamsa |
ఇలాంటి వారు చాలా ప్రమాదకరం.. అతడిని వదిలిపెట్టనంటూ మంచు మనోజ్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, సినిమా: సోషల్ మీడియా వచ్చినప్పటి కానుండి చాలా మంది వీడియోలు చేసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. కొందరు తమకు తల్లిదండ్రులపై అక్కా చెల్లెల్లపై ఉన్న ప్రేమను బయటపెడుతున్నారు. అలాగే మరికొందరు జనాలకు కనెక్ట్ అయ్యేలా రీల్స్ చేసి షేర్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ తండ్రీకూతురు ఓ వీడియో చేసి దాన్ని నెట్టింట షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఇక దీనిపై నటుడు ప్రణీత తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ బూతు కామెంట్స్ చేసి వీడియో కాల్ మాట్లాడుకున్నారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో.. అది చూసిన వారంతా ఈ ముగ్గురిపై మండిపడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించి పోస్ట్ పెట్టడంతో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా రియాక్ట్ అయ్యారు.

తాజాగా, మోహన్ కొడుకు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ కూడా పెట్టాడు. ‘‘ఇలాంటి వ్యక్తులను చూడటం భయంకరంగా అనిపిస్తుంది. సహించలేకపోతున్నాను. హాస్యం ముసుగులో దుర్వినియోగం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి సామాజిక వేదికలను ఉపయోగించడం. ఈ ప్రవర్తన అసహ్యకరమైనది మాత్రమే కాదు, ప్రమాదకరమైనది కూడా. ఒక సంవత్సరం క్రితం, నేను AP, తెలంగాణలో అఘాయిత్యాలను ఎదుర్కొంటున్న మహిళలకు మద్దతు ఇవ్వడానికి Instagram ద్వారా అతనిని సంప్రదించాను. ఎందుకంటే అతను నా దృష్టిని ఆకర్షించాడు. సానుకూల ప్రభావాన్ని చూపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. దురదృష్టవశాత్తు, నాకు ఎటువంటి స్పందన రాలేదు. ఈరోజు పసి పిల్లలపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు.

పిల్లల భద్రత, మహిళల రక్షణ మా ప్రధాన ప్రాధాన్యత గా ఉండాలి. కాబట్టి తెలంగాణ, ఏపీ సీఎంలను నేను అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మళ్లీ జరగకుండా చూసుకోవాలి.నేను టెక్సాస్ అధికారులను కూడా పిలుస్తాను. అవసరమైనప్పుడు అధికారులకు అందించడానికి నా సందేశాల స్క్రీన్‌షాట్‌లు నా వద్ద ఉన్నాయి.అదనంగా, నేను భారతదేశంలోని US ఎంబసీని అభ్యర్థిస్తున్నాను. సమస్యను పరిష్కరించడానికి USలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో మాట్లాడి పరిష్కారం చేసుకోవాలి. అమ్మ తోడు హనుమంతు నేను నిన్ను వదిలిపెట్టను’’ అని రాసుకొచ్చాడు. అలాగే కొన్ని వీడియోలను కూడా షేర్ చేశాడు. ఇక అవి చూసిన వారంతా ఆ ముగ్గురు వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed