- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్టార్ హీరో సినిమాలో విలన్‌గా చాన్స్ వస్తే పక్కా చేస్తా.. గోపీచంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్(Gopichand) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జయం’(Jayam) మూవీతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. తర్వాత హీరోగా మారి తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక అప్పటి నుంచి విలన్ క్యారెక్టర్స్‌కి గుడ్ బై చెప్పి ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. ఇక గోపిచంద్ హీరోగా, కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్‌గా నటిస్తున్న తాజా మూవీ ‘విశ్వం’(Viswam). శ్రీను వైట్ల(Srinu vaitla) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వ ప్రసాద్(TG Vishwa Prasad) నిర్మిస్తున్నారు. కాగా దోనేపూడి చక్రపాణి(DOnepudi Chakrapani) ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇక ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ ప్రమోషన్ల బిజీలో ఉన్నారు.
ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “నేను విలన్‌గా చేసిన మూడు సినిమాల ఇంపాక్ట్ అలా ఉండిపోయినట్లు ఉంది. దానివల్ల నన్ను అందరు విలన్ క్యారెక్టర్స్ చేయమంటున్నారు. కానీ, నాకు ఇప్పుడు అలా చేసే ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీలో విలన్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వస్తే మాత్రం కచ్చితంగా చేస్తాను" అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. కాగా ప్రభాస్, గోపీచంద్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి డార్లింగ్ హీరోగా, గోపిచంద్ విలన్‌గా సినిమా చేస్తే మాత్రం ఫ్యాన్స్‌కు పండగే..