పోర్న్ పాస్ పోర్ట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..

by Sujitha Rachapalli |
పోర్న్ పాస్ పోర్ట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..
X

దిశ, ఫీచర్స్ : ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక మైనర్లు కూడా అశ్లీల చిత్రాలు చూడటం ఈజీ అయిపోయింది. ఈ వీడియోలు సులభంగా యాక్సెస్ అవుతుండటంతో చిన్న వయస్సులోనే పెడదారి పడుతున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నమే చేస్తుంది స్పెయిన్. ఈ క్రమంలోనే పోర్న్ పాస్ పోర్ట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతుంది. ఇంతకీ పోర్న్ పాస్ పోర్ట్ అంటే ఏమిటి? ఆ దేశ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు యూత్ కు ఎలా మేలు చేస్తాయి? తెలుసుకుందాం.

పోర్న్ పాస్ పోర్ట్ అనేది మైనర్‌లు అశ్లీల కంటెంట్‌ను యాక్సెస్ చేయకుండా నిరోధించే లక్ష్యంతో రూపొందించిన మొబైల్ అప్లికేషన్‌. ఈ యాప్ ద్వారా లీగల్ ఏజ్ ఉంటేనే ఇలాంటి వీడియోలు చూసే అనుమతి ఉంటుంది. అధికారికంగా డిజిటల్ వాలెట్ బీటా (కార్టెరా డిజిటల్ బీటా) అని పిలవబడే ఈ యాప్.. అశ్లీల చిత్రాలను చూసే వ్యక్తి చట్టబద్ధమైన వయస్సులో ఉన్నాడో లేదో చెక్ చేయడానికి ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లను అనుమతిస్తుంది. ముందుగా వయసు ధృవీకరించమని అడుగుతుంది. ఇందుకోసం గవర్నమెంట్ జారీ చేసిన ID వినియోగించాల్సి ఉంటుంది. ఒకసారి ధృవీకరించబడిన తర్వాత 30 “పోర్న్ క్రెడిట్‌లను” స్వీకరిస్తారు. అది వారికి స్పష్టమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ పోర్న్ క్రెడిట్‌లకు నెల రోజుల వాలిడిటీ ఉంటుంది. ఒక్కో క్రెడిట్ తో అదే వెబ్ సైట్ ను పదిసార్లు యాక్సెస్ చేయవచ్చు. కాగా యాప్ ద్వారా జారీ చేయబడిన ప్రతి క్రెడిట్ QR కోడ్‌ను రూపొందిస్తుంది. యూజర్ పోర్న్ సైట్ అడ్రస్ టైప్ చేసినప్పుడు.. లింక్ అప్పియర్ అవుతుంది. అది క్లిక్ చేస్తే డిజిటల్ వాలెట్‌తో కనెక్షన్‌ని సెట్ చేస్తుంది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ఖజానా నింపే ప్రయత్నమా అని అడుగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed