సోనూసూద్‌కు కుమారి ఆంటీ స్పెషల్ ఆఫర్! ఫుడ్ స్టాల్‌‌ వద్ద రియల్ హీరో సందడి!

by Ramesh N |   ( Updated:2024-07-05 07:17:49.0  )
సోనూసూద్‌కు కుమారి ఆంటీ స్పెషల్ ఆఫర్! ఫుడ్ స్టాల్‌‌ వద్ద రియల్ హీరో సందడి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటుడు, సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మందికి హెల్ప్ చేసి ఆదుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనను ఏమీ కోరినా కూడా దాదాపు స్పందిస్తారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో సోనూసుద్ పర్యటిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన కుమారి ఆంటీని ఈ సందర్భంగా కలిశారు. ఆమె నడిపిస్తున్న ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి ఆమెకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో ముచ్చటించారు. ఎలా ఉన్నారని సోనూసూద్ పలకరించారు. తాను ఇప్పుడు కుమారి ఆంటీతో ఉన్నానని, ఆమె గురించి చాలా విన్నానని చెప్పారు. కుమారి ఆంటీ హార్డ్ వర్క్ చేయడం వల్ల తను ఈ స్థాయికి వచ్చిందన్నారు. మహిళా సాధికారత విషయంలో కుమారి ఆంటీ చక్కటి ఉదాహరణ అని కొనియాడారు.

కుటుంబాల కోసం స్త్రీలు ఎంత కష్టపడుతున్నారనేది కుమారి ఆంటీ ప్రత్యక్ష సాక్ష్యం అని హర్షం వ్యక్తంచేశారు. ఎలాంటి వంటకాలు ఉంటాయని కుమారి ఆంటీని సోనూసూద్ ఈ సందర్భంగా అడిగారు. తన వద్ద నాన్ వెజ్, వెజ్ ఫుడ్ ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు. వెజ్ రూ.80 రూపాయలు, అని, నాన్ వెజ్ రూ. 120 అని కుమారి ఆంటీ చెప్పింది. తను మాత్రం వెజ్ తింటానని సోనూసూద్ చెప్పారు. తనకు ఏదైనా డిస్కౌంట్ ఇస్తారా? అని కుమారి ఆంటీని సోనూసూద్ అడుగగా.. తనకు ఫ్రీ అని ఆమె సమాధానం ఇచ్చింది. తనకు లాటరీ తగిలిందని, ఇలా ఫ్రీగా భోజనం ఇస్తారంటే రెగ్యులర్‌గా ఇక్కడికే వచ్చి తింటానని సోనూసూద్ నవ్వుతూ అన్నారు. కరోనా సమయంలో ఎంతో మందికి హెల్ప్ చేశారని మీకు ఎంత పెట్టిన తక్కువే అని కుమారి ఆంటీ చెప్పింది. అనంతరం కుమారి అంటీని సోనూసూద్ సత్కరించారు. కాగా, సోనూసూద్ ఫుడ్ స్టాల్ వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. కాగా, సోనూసూద్ నటిస్తున్న ఫతే సినిమా రిలీజ్‌కి రెడి అవుతున్న క్రమంలో ఆయన హైదరాబాద్ పర్యటన చెప్పట్టిన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story