CVR: సీఎం సహాయ నిధికి సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ భారీ విరాళం

by Ramesh Goud |
CVR: సీఎం సహాయ నిధికి సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ భారీ విరాళం
X

దిశ, వెబ్ డెస్క్: సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల(CVR Engneering College) యాజమాన్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. సీఎం సహాయ నిధి(CMRF)కి 20 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తెలంగాణలో వరదల సమయంలో నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు మందుకు వచ్చారు. ఈ క్రమంలోనే సీవీఆర్ కళాశాల యాజమాన్యం కూడా ముందుకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాన్ని ప్రకటించారు. దీంతో జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డికి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story