రేవంత్ హయాంలో శాస్త్రీయబద్ధంగా కులగణన: ఎంపీలు

by Gantepaka Srikanth |
రేవంత్ హయాంలో శాస్త్రీయబద్ధంగా కులగణన: ఎంపీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొట్టమొదటిసారిగా రేవంత్‌ రెడ్డి సీఎం అయిన తర్వాత శాస్త్రీయ బద్ధంగా కులగణన చేశారని, దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లోని గురజాడ అప్పారావు హాలులో మీడియాతో మాట్లాడారు. కులగణనలో తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పారు. జంతర్ మంతర్ ధర్నాకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ హాజరవుతారని చెప్పారు. వీరితోపాటు డీఎంకె, ఎన్సీపీ, ఆర్జేడీ, టీఎంసీ, ఎస్పీ పార్టీ నాయకులను ఆహ్వానించినట్లు తెలిపారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఉండాలని అన్నారని.. అందులో భాగంగా తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు కేబినెట్, అసెంబ్లీలో కూడా ఆమోదించిందని చెప్పారు. కరుణానిధి, ములాయం సింగ్, లాలూ యాదవ్ బీసీ రిజర్వేషన్ల పెంపునకు చేసిన పోరాటాన్ని కొనసాగించాలన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ న్యాయం కోసం ఐక్యంగా పోరాడాలని కోరారు. న్యాయమైన హక్కుల కోసం సంఘీభావంగా ఉద్యమంలో పాల్గొనాలని అన్నారు. బీసీ ప్రధాని మోడీ కులగణనపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జై రాం రమేష్ రాజ్యసభలో లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, అనిల్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed