Medchal: సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2025-01-02 01:32:41.0  )
Medchal: సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ(Medical CMR Engineering College) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్‌ బాత్ రూముల్లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో పని చేసే వంట సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీడియోల ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ హామీ ఇచ్చారు. విద్యార్థినుల నిరసనను ఉపసంహరించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

Advertisement

Next Story