- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో’.. మరో స్టార్ జంట విడాకులు తీసుకోబోతున్నారా?
దిశ,వెబ్‌డెస్క్: భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ఆయన భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma) విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో(Unfollow) చేసుకోవడం, తన భార్యతో ఉన్న ఫొటోలను చాహల్ డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది. విడాకుల విషయాన్ని వారి సన్నిహితులు ధ్రువీకరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని సమాచారం. దీనిపై చాహల్, ధనశ్రీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వీరికి 2020లో వివాహమైంది.
అయితే.. ధనశ్రీ వర్మ కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. వివాహ అనంతరం వీళ్లిద్దరూ ఇన్‌స్టా(Instagram)లో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల ధనశ్రీ తన పేరు నుంచి ‘చాహల్’ పేరును తీసేయడంతో వీరు విడాకులకు సిద్ధమైనట్లు పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత చాహల్ సైతం ‘న్యూ లైఫ్ లోడెడ్’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయం అని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వీరు ఇన్‌స్టాగ్రామ్(Instagram) లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.