- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ.. యువకుడు మృతి..
దిశ, మీర్ పేట్ : రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడి తలకు తీవ్ర గాయాలపాలై గత మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగరాజు వివరాల ప్రకారం.. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ సీఐ ప్రధాన రహదారి బీజేపీ కార్టర్స్ వద్ద ఈ నెల 1 తేదీన మీర్ పేట్ జిల్లెల గూడకు చెందిన కూరెళ్ల అనిల్ కుమార్ (26) తన స్నేహితుడితో కలిసి చికెన్ షాప్ లో చికెన్ తీసుకొని రోడ్డు దాటుతున్నాడు.
బాలాపూర్ చౌరస్తా నుండి మంద మల్లమ్మ వైపు వెళుతున్న ద్విచక్ర వాహన దారుడు అతివేగంతో అనిల్ ని ఢీ కొట్టి తన వాహనాన్ని ఆపకుండా వెళ్ళిపోయాడు. వాహనం ఢీ కొట్టడంతో కింద పడిపోయిన అనిల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అనిల్ ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత మూడు రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం అనిల్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు పరిశీలిస్తున్నామని ప్రమాదానికి కారణమైన వాహనాన్ని త్వరలో గుర్తిస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు.