బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం

by Harish |
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి ప్రజలు 14 సంవత్సరాల కన్జర్వేటివ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ముగింపు పలికారు. మొత్తం 650 సీట్లకు గాను కైర్ స్టార్మర్ పార్టీ దాదాపు 410 స్థానాల్లో గెలిచి, భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుత ప్రధాని రిషి సునక్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి 119 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ మార్క్ 326 స్థానాలను లేబర్ పార్టీ అధిగమించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ కాబోయే ప్రధాన మంత్రి కెయిర్ స్టార్మర్ సెంట్రల్ లండన్‌లో తెల్లవారుజామున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు, ఈ సందర్భంగా మద్దతుదారులతో మాట్లాడుతూ, ‘‘మార్పు మొదలైంది’’ అని అన్నారు. ఎన్నికల్లో గెలుపొందడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మేం ఇచ్చిన హామీలను నెరవేర్చే సమయం వచ్చింది. జాతీయ పునరుద్ధరణ లక్ష్యం, దేశాన్ని పునర్నిర్మించడం ప్రారంభమైందని అన్నారు. గొప్ప బాధ్యతను మాకు అందించారు. దేశం ఈ రోజు నుంచి తదుపరి అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని అన్నారు.

Next Story

Most Viewed