- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నన్ను క్షమించండి.. పాకిస్తాన్ ఓటమికి కారణం నేనే'
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్-2022 ఫైనల్లో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్ ప్రదర్శన, జట్టు సమిష్టి కృషితో శ్రీలంక ఆసియా కప్ గెలుచుకున్నది. అయితే, మ్యాచ్‌లో లంక బ్యాట్‌మెన్ కొట్టిన బంతిని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ పట్టుకుంటుండగా షాదాబ్ ఖాన్ వచ్చి బాబర్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆ బంది బౌండరీ అవతల పడటంతో అంపైర్ సిక్స్‌గా ఇస్తారు. దీంతో పాక్ జట్టు సభ్యులతో పాటు ఫ్యాన్స్ షాదాబ్ ఖాన్‌పై ఆగ్రహానికి గురవుతారు. ఒకరకంగా చెప్పాలంటే ఫైనల్‌లో పాక్ ఓటమికి ఆ క్యాచ్ ప్రధాన కారణం. దీంతో సోషల్ మీడియా వేదికగా షాదాబ్‌పై పాక్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. దీనిపై షాదాబ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'ఆసియాకప్ ఫైనల్‌లో పాక్ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. మ్యాచ్‌లో క్యాచులు చాలా కీలకం, నన్ను క్షమించండి. జట్టు మొత్తం అద్భుతమైన ప్రదర్శన చేసింది. క్యాప్ పట్టకుండా, పట్టుకోనివ్వకుండా నేను జట్టును నిరాశ పరిచాను. విజయం సాధించిన శ్రీలంకకు శుభాకాంక్షలు'' అంటూ ట్విట్టర్ వేదికగా పాక్ ఫ్యాన్స్‌కు షాదాబ్ ఖాన్ సారీ చెప్పారు.