‘సెహ్వాగ్‌ నీకసలు బ్యాటింగే రాదు'.. పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ సంచలన కామెంట్స్

by Vinod kumar |   ( Updated:2023-07-17 10:04:33.0  )
‘సెహ్వాగ్‌ నీకసలు బ్యాటింగే రాదు.. పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ బ్యాటింగ్‌‌పై పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ రానా నవీద్‌ ఉల్‌ హసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్‌ను ఔట్ చేయడమే ఈజీగా ఉండేదంటూ ఉల్‌ హసన్‌ సంచలన కామెంట్స్ చేశాడు. తను పాక్‌ జట్టుకు ఆడే రోజుల్లో టీమిండియా మిగతా బ్యాటర్లందరికంటే సెహ్వాగ్‌‌నే ఈజీగా పెవిలియన్‌కు పంపవచ్చని భావించేవాడినని తెలిపాడు. వీరూతో పోలిస్తే రాహుల్‌ ద్రవిడ్‌ను ఎదుర్కోవడం కష్టంగా ఉండేదని పేర్కొన్నాడు.

2005లో పాకిస్తాన్‌ ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో టీమిండియా గెలుపొందగా.. ఆఖరి నాలుగు వన్డేలు గెలిచి పాక్‌ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో నవీద్‌ ఉల్‌ హసన్‌ ఏకంగా నాలుగుసార్లు సెహ్వాగ్‌ను అవుట్‌ చేయడం గమనార్హం. ఇక నవీద్‌ పాక్‌ తరఫున 74 వన్డేలు ఆడి 110 వికెట్లు పడగొట్టాడు. తొమ్మిది టెస్టులు, నాలుగు టీ20లు ఆడి వరుసగా 18, 5 వికెట్లు తీశాడు.

Advertisement

Next Story

Most Viewed