ద్రవిడ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించా.. కానీ : రోహిత్

by Harish |
ద్రవిడ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించా.. కానీ : రోహిత్
X

దిశ, స్పోర్ట్స్ : భారత ప్రధాన కోచ్‌గా కొనసాగాలని ద్రవిడ్‌ను ఒప్పించేందుకు తాను ప్రయత్నించానని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టీ20 వరల్డ్ కప్‌తో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. కోచ్‌గా కొనసాగేందుకు అతను ఆసక్తిగా లేడు. తనకు ఇదే చివరి టీ20 ప్రపంచకప్ అని ద్రవిడ్ కూడా ప్రకటించాడు. న్యూయార్క్‌లో సోమవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్.. ద్రవిడ్‌తో తన అనుబంధం గురించి మాట్లాడాడు. ‘కోచ్‌గా ఉండాలని ద్రవిడ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించా. కానీ, అతను సిద్ధంగా లేడు. అతను వెళ్లడం కష్టంగా ఉంటుంది. అతనితో గడిపిన సమయాన్ని ఎంజాయ్ చేశా. అతను మన అందరికీ రోల్ మోడల్. అతను ఏం సాధించాడో మనకు తెలుసు. కెరీర్‌లో గొప్ప సంకల్పాన్ని ప్రదర్శించాడు.’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed