ఇంగ్లండ్ బ్యాటర్ విధ్వంసం.. వరుసగా 5 సిక్సర్లు..

by Vinod kumar |   ( Updated:2023-06-24 11:46:38.0  )
ఇంగ్లండ్ బ్యాటర్ విధ్వంసం.. వరుసగా 5 సిక్సర్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ బ్యాటర్ విల్ జాక్స్ బ్యాటుతో రెచ్చిపోయాడు. గాయం కారణంగా ఐపీఎల్ మిస్ అయిన అతను ప్రస్తుతం టీ20 బ్లాస్ట్‌లో అదరగొడుతున్నాడు. సర్రే తరఫున ఆడుతున్న అతను.. మిడిలెసెక్స్ మ్యాచ్‌లో చెలరేగాడు. ఏకంగా 7 సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు. అయితే సెంచరీకి ఒక్క షాట్ దూరంలో పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే టీమ్‌కు విల్ జాక్స్ అదిరిపోయే ఆరంభం అందించాడు. అతనితోపాటు మరో ఓపెనర్ లారీ ఇవాన్స్ కూడా చెలరేగాడు. జాక్స్ కేవలం 45 బంతుల్లోనే 96 పరుగులతో మెరవగా.. ఇవాన్స్ కూడా 37 బంతుల్లో 85 రన్స్ చేశాడు. ముఖ్యంగా 11వ ఓవర్లో జాక్స్ రెచ్చిపోయాడు. వరుసగా 5 సిక్సర్లతో చెలరేగాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతన్ని ఆర్సీబీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ గాయం వల్ల అతను ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

మిగతా బ్యాటర్లు ఫెయిలైనా చివర్లో సర్రే కెప్టెన్ క్రిస్ జోర్డాన్ (7 బంతుల్లో 16 నాటౌట్) కూడా భారీ షాట్లు ఆడాడు. దీంతో సర్రే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 252 పరుగులు చేసింది. భారీ స్కోరు చేసినా కూడా సర్రేకు ఓటమి తప్పలేదు. ఛేజింగ్‌లో మిడిలెసెక్స్ కూడా అదరగొట్టింది. మిడిలెసెక్స్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలుండగానే కేవలం మూడు వికెట్ల నష్టానికే 254 పరుగులు చేసింది.

Advertisement

Next Story

Most Viewed