SV Mohan Reddy: వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం.. ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shiva |
SV Mohan Reddy: వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం.. ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) కుటుంబంలో ఆస్తుల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే వైస్ జగన్ (YS Jagan) దంపతులు, వైఎస్ షర్మిల (YS Sharmila)తో పాటు విజయమ్మ (Vijayamma)కు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ కుటుంబం (YS Family)లో ఆస్తుల వివాదంపై తాజాగా వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి (SV Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల (YS Sharmila)కు రావాల్సిన ఆస్తులు అన్నింటినీ జగన్ (Jagan) ఎప్పుడో ఇచ్చేశారని కామెంట్ చేశారు.

తెర చాటున ఎలాగైనా జగన్ బెయిల్‌ (Jagan Bail)ను రద్దు చేయాలనే కుట్రలు జరుగుతున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ బెయిల్ రద్దు కోసం జరిగే కుట్రలో షర్మిల ప్రత్యక్షంగా.. పరోక్షంగా భాగం కావొద్దని అన్నారు. తల్లి విజయమ్మ, చెల్లెల్లు షర్మిలపై జగన్‌కు అపారమైన ప్రేమ ఉందని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ (YSRCP)తో కాంగ్రెస్ (Congress) పొత్తు పెట్టుకోవాలంటే అందుకు షర్మిల (Sharmila) అడ్డుగా ఉందనే ఆరోపణలను ఆయన కొట్టి పడేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ (YSRCP Party) బలంగా ఉందని.. ఒక వేళ కాంగ్రెస్ అధిష్టానం (Congress Hi-Command) తమతో పొట్టు పెట్టుకోవాలనే అనుకుంటే షర్మిలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోబోదని అన్నారు. కానీ, ఇప్పటి వరకు కాంగ్రెస్‌ (Congress)తో పొత్తు విషయంలో తమ పార్టీ ఆలోచన చేయట్లేదని ఎస్వీ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed