మహిళా టీమ్‌కు మెంటార్‌గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా..

by Vinod kumar |   ( Updated:2023-02-18 07:17:38.0  )
మహిళా టీమ్‌కు మెంటార్‌గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా..
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మెంటార్‌గా టెన్నిస్​స్టార్​సానియా మీర్జా ఎంపికయ్యారు. ఈ వార్తను ఆర్సీబీ తన ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. మార్చిలో జరిగే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆమె మెంటార్ గా వ్యవహరించనుంది. ఇప్పటిదాకా అన్ని జట్లకు క్రికెటర్లే మెంటార్లుగా ఉన్నారు. టెన్నిస్ లో ఆరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన మీర్జా, జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఆడింది. రోహన్ బోపన్నతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ నెలలో దుబాయ్ లో జరిగే డబ్ల్యూటీఏ టోర్నీతో ఆమె ఆటకు వీడ్కోలు పలకనుంది.

Advertisement

Next Story