PKL 2024 : తెలుగు టైటాన్స్‌కు షాక్.. జైపూర్ చేతిలో చిత్తు

by Harish |
PKL 2024 : తెలుగు టైటాన్స్‌కు షాక్.. జైపూర్ చేతిలో చిత్తు
X

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో గత మ్యాచ్‌తో గెలుపు బాట పట్టిన తెలుగు టైటాన్స్ ఆ తర్వాతి మ్యాచ్‌లోనే పరాజయం పాలైంది. నోయిడా వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో 41-28 తేడాతో చిత్తుగా ఓడింది. ఆరంభంలో జైపూర్‌కు టైటాన్స్ గట్టిపోటీనిచ్చింది. ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు పాయింట్ల కోసం పోటీపడ్డాయి. దీంతో ఫస్టాఫ్‌లో ఇరు జట్లు 18-18తో సమవుజ్జీలుగా నిలిచాయి.

సెకండాఫ్‌లో టైటాన్స్ జోరు తగ్గింది. జైపూర్‌దే స్పష్టమైన ఆధిపత్యం. ఆ జట్టు ప్లేయర్లు వరుస పాయింట్లతో దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో టైటాన్స్ రెండు సార్లు ఆలౌటవడం ప్రత్యర్థి జోరుకు కళ్లెం వేయడంలో విఫలమవడంతో ఓటమి నుంచి బయటపడలేకపోయింది. దీంతో విజయ్ మాలిక్(17 పాయింట్లు) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. నీరజ్ నర్వాల్(12), అర్జున్ దేశ్వాల్(11) జైపూర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు, బెంగళూరు బుల్స్ ఓటమి పరంపర కొనసాగుతోంది. పాట్నా పైరేట్స్ 54-29 తేడాతో ఓడిపోయింది. బెంగళూరుకు ఇది వరుసగా 8 ఓటమి. పాట్నా తరపున రైడర్ దేవాంక్(17 పాయింట్లు), అయాన్(13) సత్తాచాటారు.

Advertisement

Next Story

Most Viewed