- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress Party: మీ అనుమానాలను 3న ప్రత్యక్షంగా వచ్చి చర్చించండి
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Elections) ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ(Congress Party) రాసిన లేఖకు ఎన్నికల సంఘం(Election Commission) సమాధానమిచ్చింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఖండించిన ఈసీ.. అవసరమైతే ఆ ఆరోపణలపై చర్చకు డిసెంబర్ 3వ తేదీన తమ వద్దకు రావాలని ఆహ్వానించింది. ఆ ఆరోపణలను మరింత లోతుగా చర్చించడానికి సిద్ధమని తెలిపింది. ఎన్నికలకు ముందు తమ మద్దతుదారుల ఓట్లు జాబితా నుంచి తొలగించారని, ఆ తర్వాత కనీసం 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదనంగా సుమారు పది వేల చొప్పును ఓట్ల చేర్పు జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ స్థానాల్లో్ 47 సీట్లు బీజేపీ గెలిచిందని గుర్తు చేస్తూ ఓటర్ల జాబితాలో మార్పుల్లో అవకతవకలు జరిగాయని, పోలింగ్ తర్వాత ఓటింగ్ శాతం అమాంతం పెంచడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈసీకి కాంగ్రెస్ లేఖ రాసింది. ఓటర్ల జాబితాలో మార్పలు చేర్పుల ప్రక్రియ అన్ని పార్టీల పర్యవేక్షణలోనే జరుగుతుందని, ఆ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నదని ఈసీ తెలిపింది. పోలింగ్ శాతం ఎందుకు పెరిగిందో ఇది వరకే తాము తెలిపామని, ఆ ఆరోపణలపై ఇంకా చర్చించాలనుకుంటే డిసెంబర్ 3వ తేదీన తమ వద్దకు రావాలని ఈసీ తాజాగా లేఖ రాసింది.
మీ గెలుపును అనుమానించరా?
ఈవీఎంల విశ్వసనీయతపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ముందుగా రాజీనామా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు. బ్యాలట్ పేపర్లు వచ్చిన తర్వాతే వీరంతా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాలని, లేదంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కేవలం ఉత్త మాటలుగానే మిలిపోతాయన్నారు. ఈవీఎంల వ్యవహారంపై కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఎన్నికల పారదర్శకత, ఈవీఎంల విశ్వసనీయతసై సుప్రీంకోర్టు చాలాసార్లు క్లీన్ చీట్ ఇచ్చిందని గుర్తు చేశారు. రాహుల్, ప్రియాంకలు ఇదే ప్రక్రియ ద్వారా ఎంపీలుగా ఎన్నికయ్యారని, వారి గెలుపును అనుమానించరా? అని ప్రశ్నించారు. కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభ ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ త్వరలో చరిత్ర పుటలకే పరిమితం కానుందని స్పష్టం చేశారు.