Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌పై లిక్విడ్ ఎటాక్

by Mahesh Kanagandla |
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌పై లిక్విడ్ ఎటాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)పై లిక్విడ్ ఎటాక్(Liquid Attack) జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో మద్దతుదారులతో కలిసి పాదయాత్ర చేస్తుండగా ఓ దుండగుడు కేజ్రీవాల్‌పై ద్రవాన్ని(నీరు!) చిమ్మాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ హైడ్రామా నెలకొంది. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తనపై జరిగిన దాడికి దిగ్భ్రమ చెందారు. దేశ రాజధానిలో మాజీ సీఎంకే రక్షణ లేనప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆప్ ప్రశ్నించింది. బీజేపీ హయాంలో ఢిల్లీలో శాంతి భద్రతలు దిగజారాయని, కేజ్రీవాల్ పై దాడి వెనుక బీజేపీ ఉన్నదని తీవ్ర ఆరోపణలు చేసింది. నిందితుడిని స్థానికుడైన అశోక్ ఝా అని, ఆయన బీజేపీ సభ్యుడని ఆప్ పేర్కొంది. దాడికి కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ‘అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి స్పిరిట్ చల్లాడు. ఆ స్మెల్ గుర్తించవచ్చు. కేజ్రీవాల్‌ను సజీవ దహనం చేసే కుట్రలు జరుగుతున్నాయి. ఆ వ్యక్తి ఒక చేతిలో స్పిరిట్, మరో చేతిలో అగ్గిపెట్టే పట్టుకున్నాడు. కేజ్రీవాల్‌పై స్పిరిట్ విసిరిన యువకుడు అగ్గిపెట్టే తీసేలోపు సెక్యూరిటీ ఆయనను అడ్డుకుంది’ అని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో శాంతి భద్రతలు దిగజారాయని, Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌పై లిక్విడ్ ఎటాక్కేంద్రం, మోమం మంత్రి పట్టనట్టు ఉంటున్నారని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు. తాజా దాడి వెనుక కూడా బీజేపీ ఉన్నదని ఫైర్ అయ్యారు. ఈ ఆరోపణలను ఢిల్లీ బీజేపీ కొట్టిపారేసింది. అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ ఓల్డ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని, ఆ దాడి గురించి ఏదైనా సరే అరవింద్ కేజ్రీవాలే క్లియర్‌గా చెప్పాలని సెటైర్ వేసింది.

Advertisement

Next Story