Adhani: ప్రతీ సవాల్ మమ్మల్ని మరింత బలపరుస్తుంది.. పారిశ్రామిక వేత్త గౌతం అదానీ

by vinod kumar |
Adhani: ప్రతీ సవాల్ మమ్మల్ని మరింత బలపరుస్తుంది.. పారిశ్రామిక వేత్త గౌతం అదానీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో ఇటీవల తమపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gowtham adhani) తొలిసారి స్పందించారు. తమపై జరిగిన ప్రతి దాడి మమ్మల్ని మరింత బలపరుస్తుందని నొక్కి చెప్పారు. ది ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (FCPA) కింద అదానీ గ్రూప్‌కు చెందిన ఎవరూ ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోలేదని స్పష్టం చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారం జరిగిన 51వ ఇండియా జెమ్ అండ్ జువెలరీ అవార్డ్స్ (ఐజీజేఏ) కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘అదానీ గ్రూపుపై రెండు వారాల క్రితం యూఎస్ ప్రాసిక్యూటర్లు పలు అభియోగాలు మోపారు. ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ప్రాజెక్టులపై అనేక ఆరోపణలు ఎదుర్కొ్న్నాం. ఇవి మా సంస్థకు కొత్తేమీ కాదు. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమే. కానీ మనకు ఎదురైన ప్రతి సవాల్ మరింత బలపడేలా చేస్తుంది. ప్రతి అడ్డంకి ఒక మెట్టు అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. అవి కేవలం ఆరోపణలు మాత్రమేనని వాటిని రుజువు చేసేందుకు ఒక్క ఆధారం కూడా లేదని తెలిపారు. ప్రస్తుత ప్రపంచంలో నిజాల కంటే అబద్దాలే అత్యంత వేగంగా వ్యాపిస్తున్నాయని తెలిపారు. మేము చట్టపరమైన ప్రక్రియ ద్వారా మాత్రమే పని చేస్తు్న్నామని చెప్పారు. ఆ ప్రతికూల పరిస్థితులలో కూడా, మేము మా సూత్రాలకు కట్టుబడి ఉన్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed