- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Aap mla: ఆప్‌కు భారీ షాక్ .. దోపిడీ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (Aap)కు మరో భారీ షాక్ తగిలింది. 2023 దోపిడీ కేసుకు సంబంధించిన కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ (Naresh balyan)ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం ఆర్కే పురంలోని తమ కార్యాలయానికి పిలిచిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ కపిల్ సంగ్వాన్ అలియాస్ నందుతో మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు రావడంతో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆడియో క్లిప్‌లో వ్యాపారవేత్తల నుంచి దోపిడీకి సంబంధించి గ్యాంగ్‌స్టర్‌కు, ఎమ్మెల్యేకు మధ్య సంభాషణ జరిగినట్టు సమాచారం. దీనికి సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నరేష్ అరెస్టుపై ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. ఢిల్లీలో శాంతి భద్రత పరిస్థితి గురించి కేజ్రీవాల్ ప్రశ్నించడంతో మోడీ, అమిత్ షాలు ఆందోళనకు గురయ్యారన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను వేధించడానికే కుట్ర పూరితంగా అరెస్టులు చేస్తు్న్నారని తెలిపారు. బల్యాన్ పై ఉన్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టి పారేశారు.