- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసాధారణ విజయం.. భారత మహిళల హాకీ జట్టుపై ప్రధాని మోడీ ప్రశంసలు
దిశ, స్పోర్ట్స్ : ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత మహిళల హాకీ జట్టుపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. అసాధారణ విజయం సాధించారని కొనియాడారు. గురువారం ట్విట్టర్ వేదికగా ప్రధాని భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ‘ఇది అసాధారణ విజయం. మహిళల చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మన హాకీ జట్టుకు అభినందనలు. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడారు. వారి విజయం రాబోయే క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది.’ అని పేర్కొన్నారు. బిహార్‌లో జరిగిన టోర్నీలో భారత అమ్మాయిలు సంచలన ప్రదర్శన చేశారు. ఒక్క మ్యాచ్ కూడా కోల్పోకుండా అజేయంగా నిలవడం గమనార్హం. ఫైనల్‌లో చైనాను 1-0తో చిత్తు చేసి వరుసగా రెండోసారి, మొత్తంగా మూడో సారి టైటిల్ దక్కించుకుంది. దీంతో భారత జట్టు దాదాపు రూ.8.5 లక్షల ప్రైజ్‌మనీ అందుకుంది.అలాగే, హాకీ ఇండియా ప్రతి క్రీడాకారిణికి రూ.3 లక్షల చొప్పున, సపోర్టింగ్ స్టాఫ్‌లోని ప్రతి ఒక్కరికి రూ.1.5 లక్షల రివార్డు ప్రకటించింది.