ఐర్లాండ్ ప్లేయర్ అరుదైన ఘనత.. రెండో ఐరిష్‌ క్రికెటర్‌గా..

by Vinod kumar |
ఐర్లాండ్ ప్లేయర్ అరుదైన ఘనత.. రెండో ఐరిష్‌ క్రికెటర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఐర్లాండె ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో పాల్ స్టిర్లింగ్ (103) సెంచరీ చేశాడు. దీంతో పాల్ స్టిర్లింగ్ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన 23 ప్లేయర్‌గా.. ఈ ఘనత సాధించిన రెండో ఐరిష్‌ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకు ముందు ఈ ఘనతను కెవిన్‌ ఓబ్రెయిన్‌ మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు. అయితే ఓవరాల్‌గా ఈ ఘనతను మొదట విండీస్ వీరుడు క్రిస్ గేల్ సాధించగా.. టీమ్ ఇండియా తరఫున సురేష్ రైనా సాధించాడు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ఐర్లాండ్‌.. రెండో రోజు రెండో సెషన్‌ సమయానికి 121 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 415 రన్స్ చేసింది. ఇందుల్లో కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ (95), లోర్కన్‌ టక్కర్‌ (80), కర్టిస్‌ క్యాంఫర్‌ (68 నాటౌట్‌) రాణించారు. లంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య, అషిత ఫెర్నాండో తలో 2 వికెట్లు, విశ్వ ఫెర్నాండో, రమేశ్‌ మెండిస్‌ చెరో వికెట్‌ తీశారు.

Advertisement

Next Story