Olympics: భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్ కు షాక్.. మూడేళ్ల నిషేదం విధించిన ఐఓఏ

by Ramesh Goud |
Olympics: భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్ కు షాక్.. మూడేళ్ల నిషేదం విధించిన ఐఓఏ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒలంపిక్స్ నుంచి డిపోర్ట్ అయిన భారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ కు ఇండియన్ ఓలంపిక్ అసోషియేషన్ పెద్ద షాక్ ఇచ్చింది. క్రమశిక్షణా చర్యల కింద మూడేళ్లపాటు నిషేదం విధించింది. పారిస్ ఒలంపిక్స్ లో అంతిమ్ పంఘాల్ తన అక్రిడిటేషన్ కార్డును దుర్వినియోగం చేసిందన్న కారణంతో ఒలంపిక్స్ కమిటీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. తన అక్రిడిటేషన్ కార్డు రద్దు చేయడంతో పాటు తన సిబ్బంది తో సహా అందరినీ డిపోర్ట్ చేసింది. దీనిపై విచారణ జరిపిన ఇండియన్ ఒలంపిక్స్ అసోషియేషన్ అంతిమ్ దే తప్పని నిర్ధారించుకుంది. క్రమశిక్షణా చర్యల కింద అంతిమ్ పంఘాల్ పై మూడేళ్ల పాటు నిషేదం విధిస్తూ.. నిర్ణయం తీసుకుంది. కాగా పారిస్ ఒలంపిక్స్ లో అంతిమ్ పంఘాల్ మహిళల ఫ్రీ స్టైల్ 53 కేజీల విభాగంలో టర్కీ రెజ్లర్ యెట్ గిల్ చేతిలో క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయింది.

అనంతరం రూంకు వెళ్లిన అంతిమ్.. సోదరికి తన అక్రిడిటేషన్ కార్డు ఇచ్చి ఒలంపిక్ విలేజ్ లో ఉన్న లగేజీని తీసుకొని రమ్మని పంపింది. అంతిమ్ అక్రిడిటేషన్ కార్డుతో ఒలంపిక్ విలేజ్ కు వెళ్లిన నిషా.. లగేజీ తీసుకొని వచ్చే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. తన సోదరి లగేజీ కోసం పంపిందని చెప్పడంతో తన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. అనంతరం అంతిమ్ పంఘాల్ ను పిలిచి తన స్టేట్ మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. అనంతరం దీనిపై విచారణ జరిపిన ఒలంపిక్స్ కమిటీ అంతిమ్ తన అక్రిడిటేషన్ కార్డును దుర్వినియోగం చేసిందని గుర్తించి, తనతో పాటు తన సిబ్బందిని కూడా డిపోర్ట్ చేసింది. ఒలంపిక్స్ లో ఎంట్రన్స్ కోసం ఆటగాళ్లకు ఇచ్చే అక్రిడిటేషన్ కార్డు వేరొకరు ఉపయోగించడం ఒలంపిక్ రూల్స్ కు విరుద్దం. ఇందులో భాగంగానే అంతిమ్ పంఘాల్ పై ఒలంపిక్స్ కమిటీ చర్యలు తీసుకుంది.

Advertisement

Next Story