- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పారిస్ ఒలింపిక్స్: వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాన్ని కోల్పోయి మీరాబాయి చాను
దిశ, వెబ్‌డెస్క్: 2024 పారిస్ ఒలింపిక్స్ లో భారత ప్లేయర్లను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. గురువారం జరిగిన మహిళల 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత ప్లేయర్ సైఖోమ్ మీరాబాయి చాను పతకం రేసులో నిరాశనే మిగిల్చింది. ఈ ఈవెంట్ లో మొత్తం 199 కిలోల (88 + 111) బరువు ఎత్తి నాలుగో స్థానంలో ముగించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారతదేశపు అగ్రశ్రేణి పతక పోటీదారుల్లో ఒకరైన మీరాబాయి చాను తన రెండవ ప్రయత్నానికి ముందు స్నాచ్‌లో 85 కేజీల లిఫ్ట్‌తో ప్రారంభించింది. అలాగే మూడో ప్రయత్నంలో 88 కిలోల బరువును విజయవంతంగా ఎత్తింది. క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీల విఫల ప్రయత్నంతో శుభారంభం చేసింది. ఆమె 114 కేజీలు ఎత్తినప్పుడు తన చివరి ఆరో ప్రయత్నంలో మరోసారి తడబడింది. దీంతో కీలక మెడల్ ఈవెంట్‌లో మీరాబాయి చాను మొత్తం 199 కిలోల (88 + 111)తో తన గేమ్ ముగించగా నాలుగో స్థానానికి పరిమితం అయింది. ఇదే ఇవేంట్‌లో 206 కేజీలు (89 + 117) ఎత్తిన చైనాకు చెందిన హౌ జిహుయ్ స్వర్ణ పతకాన్ని అందుకుంది.