జకోకు గాయం.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి విత్‌డ్రా

by Harish |
జకోకు గాయం.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి విత్‌డ్రా
X

దిశ, స్పోర్ట్స్ : సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్, వరల్డ్ నం.1 నోవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. నాలుగో రౌండ్‌లో మోకాలి గాయానికి గురైన అతను టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని నిర్వాహకులు మంగళవారం వెల్లడించారు. టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టిన జకో టైటిల్ నిలబెట్టుకునే దిశగా సాగాడు. సోమవారం నాలుగో రౌండ్‌లో ఫ్రాన్సిస్కో సెరుండోలో(అర్జెంటీనా)పై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఆ మ్యాచ్‌లో జకో కుడి మోకాలికి గాయమైంది. గాయంతోనే పోరాడి అతను అర్జెంటీనా ఆటగాడిని చిత్తు చేశాడు. మ్యాచ్ అనంతరం ఎంఆర్‌ఐ స్కాన్‌ తీయగా మోకాలిలో చీలిక కనిపించినట్టు నిర్వాహకులు తెలిపారు. బుధవారం అతను క్వార్టర్స్‌లో 7వ సీడ్ రూడ్‌తో తలపడాల్సి ఉంది. అయితే, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకోవడంతో జకో వరల్డ్ నం.1 ర్యాంక్‌ కూడా కోల్పోనున్నాడు. ప్రస్తుతం వరల్డ్ నం.2లో ఉన్న జెన్నిక్ సిన్నర్(ఇటలీ) అగ్రస్థానానికి చేరుకోనున్నాడు.

Advertisement

Next Story

Most Viewed