- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సంచలన నిర్ణయం తీసుకున్న అఫ్గాన్ క్రికెటర్
దిశ, స్పోర్ట్స్ : ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ బ్యాటర్ నూర్ అలీ జద్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2009లో నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అఫ్గాన్ తరపున రెండు టెస్టులు, 51 వన్డేలు, 22 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 1,919 పరుగులు చేశాడు. చివరిసారిగా ఐర్లాండ్‌తో ఏకైక టెస్టుతో అఫ్గాన్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు. గతేడాది ఆసియా క్రీడల్లో నూర్ అలీ జద్రాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. శ్రీలంక, పాకిస్తాన్ మ్యాచ్‌ల్లో 51, 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి కృషి చేశాడు. 2010 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడిన అతను హాఫ్ సెంచరీ సాధించాడు.
- Tags
- #Noor Ali Zadran