Neeraj Chopra: పారిస్​ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా..

by Vinod kumar |   ( Updated:2023-08-25 10:00:45.0  )
Neeraj Chopra: పారిస్​ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా..
X

దిశ, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతాక విజేత, భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా మరోసారి తన సత్తా నిరూపించాడు. 88.77 మీటర్ల త్రో విసిరి ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి ప్రవేశించడం సహా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్స్‌ పోటీల్లో మొదటి ప్రయత్నంలోనే 88.77 మీటర్లు బల్లెం విసిరి.. ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

హంగేరీ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ క్వాలిఫయర్స్‌ తొలి ప్రయత్నంలోనే ఈ సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో నీరజ్ చోప్రా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వాలిఫైయింగ్‌ గ్రూప్‌-ఏలో పోటీపడిన నీరజ్‌ చోప్రా 88.77 మీటర్లు విసిరాడు. దీంతో ఫైనల్‌కు కటాఫ్‌ మార్క్‌ 83 మీటర్లను అధిగమించడం వల్ల ఫైనల్‌కు చేరాడు. ఆదివారం ఫైనల్‌ జరగనుంది. అలాగే ప్రపంచ అథ్లెటిక్స్‌ ఫైనల్‌కు చేరుకోవడంతో పారిస్‌ ఒలింపిక్స్‌కూ అర్హత సాధించాడు.

Advertisement

Next Story