- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా బాడీ సిగ్నల్ ఇచ్చిన లెక్క చేయకుండా ఆ పిచ్చి పని చేశా.. ఇదో గుణపాఠం.. రకుల్ ఎమోషనల్(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఎన్టీఆర్(ntr), రామ్ చరణ్(ram charan), అల్లు అర్జున్(allu arjun), నాగార్జున(nagarjuna) వంటి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లింది. ఇక టాలీవుడ్‌లో స్టార్‌గా రాణిస్తున్న సమయంలో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. కానీ అక్కడ ఈ భామకు వరస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హిందీలో అజయ్ దేవగన్‌తో కలిసి ‘దేదేప్యార్ దే 2’ మువీలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. రకూల్.. హీరోయిన్‌గా అందాన్ని కాపాడుకునేందుకు డైట్, వర్కవుట్స్ పైనా ఎక్కువ శ్రద్ధ పెడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిమ్‌లో బెల్ట్ కూడా వాడకుండా 80 కిలోల బరువు ఎత్తింది. ఈ సమయంలో ఆమెకు వెన్ను నొప్పి మొదలైంది. అయినా పట్టించుకోకుండా షూటింగ్‌లలో పాల్గొన్నది. దీంతో వెన్నునొప్పి తీవ్రమయింది. అలా నొప్పి ఎక్కువవడంతో వైద్యులను సంప్రదించగా కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. అయితే తాజాగా ఈ బ్యూటీ తన హెల్త్ అప్‌డేట్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది.
అందులో ఆమె మాట్లాడుతూ.. 'హాయ్ అందరికీ.. నేను ఓ పిచ్చి పని చేశాను. నా శరీరాన్ని పట్టించుకోలేదు. వెన్నునొప్పి ఉన్నా లెక్కచేయలేదు. చివరకు అది ఎక్కువైంది. ఆరు రోజులుగా బెడ్‌పైనే ఉన్నాను. పూర్తిగా కోలుకోవడానికి మరో వారం రోజులు పడుతుందనుకుంటాను. ఇలా మంచానికే పరిమితం కావడం ఏమీ బాగోలేదు. వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. కానీ ఇదొక గుణపాఠంగా భావిస్తాను. మన బాడీ ఏదైనా సిగ్నల్స్ ఇచ్చినప్పుడు దాని మాట పట్టించుకోకుండా ముందుకు వెళ్లకూడదని తెలుసుకున్నాను. నేను నా బాడీ కన్నా మైండ్ ఎక్కువ స్ట్రాంగ్ అని ఫీలయ్యాను. అన్నివేళలా అది నిజం కాదని తెలిసొచ్చింది. నా ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని రకూల్ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.