బిగ్ అలర్ట్.. హైదరాబాద్ కు భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో కూడా..

by Y.Nagarani |
బిగ్ అలర్ట్.. హైదరాబాద్ కు భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో కూడా..
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఏపీలోని తిరుపతి జిల్లా తడ వద్ద తీరందాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇది అల్పపీడనంగా బలహీనపడి ఉన్నట్లు తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రానున్న 3 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం కురవనున్నట్లు తెలిపింది. ఉద్యోగులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అలాగే జనగామ, కామారెడ్డి, మెదక్, మల్కాజ్ గిరి, సిరిసిల్ల, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. భారీ వర్షసూచన నేపథ్యంలో రైతులు కలత చెందుతున్నారు. పంటలు వర్షార్పణమైతే.. ఈసారి కూడా నష్టాలను భరించాలని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed