శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఎల్లుండే 2025 టికెట్లు విడుదల

by Rani Yarlagadda |   ( Updated:2024-10-17 15:55:47.0  )
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఎల్లుండే 2025 టికెట్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రతి నెలా.. రెండు, మూడు నెలల ఆర్జిత సేవ, దర్శన టికెట్లను విడుదల చేసింది. కానీ.. ఈసారి భక్తుల సౌకర్యార్థం 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవ, దర్శన టికెట్లన ఈ నెలలోనే విడుదల చేయనుంది. రెండు నెలల ముందుగానే జనవరి టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 19న ఆర్జిత సేవల కోటాను విడుదల చేస్తుంది. వాటిలో కొన్నింటిని ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోటా కింద 21న ఉదయం 10 గంటల వరకూ భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.

అలాగే.. 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా జనవరి కోటా టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. స్వామివారి భక్తులు ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది.

Advertisement

Next Story