- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండా సురేఖ వివాదంపై మరోసారి స్పందించిన సమంత.. నేను ఈ రోజు ఇలా ఉండటానికి కారణం వారే అంటూ
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. గత కొంత కాలంగా మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది. ప్రస్తుతం సామ్.. ఈ సిరీస్ ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నది.
తాజాగా సిటాడెల్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. మరోసారి కొండా సురేఖ వివాదంపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. “ఈ రోజు నేను ఇక్కడ కూర్చోవడానికి ఎంతో మంది మద్దతే కారణం. ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రేమ, నాపై వారికి ఉన్న నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. కష్టాలను ఎదుర్కోవడంలో ఆ మద్దతు నాకెంతో సహాయపడింది. వారు నా పక్షాన లేకపోతే కొన్ని పరిస్థితులను అధిగమించేందుకు చాలా సమయం పట్టేది. నేను వాటిని వదులుకోవాలని కూడా భావించేదాన్నేమో. నా చుట్టూ ఉన్న వారి నమ్మకం వల్లే వాటిని ఎదుర్కోగలిగాను” అని వెల్లడించారు సమంత.
అదేవిధంగా ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. "అలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించను. ద్వేషపూరిత సందేశాలను స్వీకరించినప్పుడు వాటి ప్రభావం నాపై పడకుండా చూసుకుంటాను. దాన్ని పంపిన వారు కూడా అలాంటి బాధనే అనుభవించారేమో అని ఆలోచిస్తాను” అంటూ సామ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.