- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Devara Movie: " దేవర " హిందీలో మాత్రమే హిట్ అయిందా.. మరి, మిగతా చోట్లా సినిమా రిజల్ట్ ఏంటి?
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమా.. దేవర. ఈ సినిమా సెప్టెంబరు 27న ఆడియెన్స్ ముందుకొచ్చింది. మిక్స్డ్ టాక్ తో దూసుకెళ్లిన ఈ మూవీ ఓపెనింగ్ వీకెండ్లో మంచి వసూళ్లే సాధించింది.
ఆ తర్వాత కొంచెం స్లో అయిన.. దసరా సెలవులు రావడంతో ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల సినిమా మంచిగా రన్ అవుతుంది. కాకపోతే, ప్రస్తుతం కలెక్షన్స్ జోరు తగ్గింది. యుఎస్‌లో, కర్ణాటకలో తెలుగు వెర్షన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, సౌత్‌లో అన్నీ చోట్ల పెద్దగా ప్రభావం చూపలేదు.
దేవర తెలుగులో కాకుండా హిందీలో మాత్రమే పెద్ద హిట్ అయిందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. అక్కడైతే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. అసలు ఏ మాత్రం కూడా బజ్ లేని దేవర హిందీ వెర్షన్‌కు అదిరిపోయే రెస్పాన్సే వచ్చింది. ఫస్ట్ వీకెండ్ రూ.25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది దేవర. తెలుగులో ఈ సినిమా కొన్ని చోట్ల మాత్రమే బయ్యర్లకు లాభాలను అందించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే తెలుగు కంటే హిందీలోనే హిట్ అయిందని సినీ వర్గాల వారు అంటున్నారు.