US B-2 bombers launch: హౌతీ రెబల్స్ పై విరుచుకుపడ్డ అమెరికా

by Shamantha N |   ( Updated:2024-10-17 05:38:46.0  )
US B-2 bombers launch: హౌతీ రెబల్స్ పై విరుచుకుపడ్డ అమెరికా
X

దిశ, నేషనల్ బ్యూరో: యెమెన్‌లో హౌతీ రెబల్స్‌పై అమెరికా విరుచుకపడింది. గురువారం తెల్లవారుజామున యెమెన్‌పై బీ-2 స్టెల్త్‌ బాంబర్లలతో భీకర దాడులు చేసింది. ఈ విషయాన్ని పెంటగాన్ వెల్లడించింది. ఎర్ర సముద్రంలో పౌర నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి హూతీలు వినియోగించే ఆయుధాలను భద్రపర్చే డిపోలపై దాడులు చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ‘‘మా నుంచి తప్పించేందుకు వీలుగా శత్రువులు తమ ఆయుధాలను ఎంత లోతుగా దాచినా వదిలిపెట్టమన్న విషయం ఈ దాడితో నిరూపితమైంది. ఇక ఈ దాడికి మా వాయుసేన బీ-2 స్టెల్త్‌ బాంబర్‌ వాడాం. దీంతో, అవసరమైనప్పుడు ఎక్కడైనా దాడి చేయగల మాకున్న సామర్థ్యం ఏమిటో చెప్పినట్లైంది. హూతీల సామర్థ్యాన్ని కుప్పకూల్చాలని అధ్యక్షుడు జోబైడెన్‌ జారీ చేసిన ఆదేశాల మేరకే ఈ దాడిని చేపట్టాం. వారు భవిష్యత్తులో చేసే దాడులకు తీవ్ర పరిణామాలుంటాయని మేము హెచ్చరిస్తున్నాం’’ అని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్‌ ఆస్టిన్‌ అన్నారు.

తొలిసారిగా బీ-2 బాంబర్ వాడకం..

ఇకపోతే, ఈ దాడితో హూతీలపై అమెరికా తొలిసారిగా బీ-2 బాంబర్ వాడింది. సాధారణ ఫైటర్‌ జెట్లతో పోలిస్తే ఈ ఫైటర్ జెట్ అత్యంత శక్తిమంతమైంది. సుదూర లక్ష్యాలను కూడా ఈజీగా ఛేదిస్తుంది. అంతేకాదు.. అత్యంత భారీ బాంబులను కూడా ఇది మోసుకెళ్లగలదు. ఇప్పటివరకు అమెరికా కేవలం సాధారణ ఫైటర్‌ విమానాలనే హూతీలపై వాడింది. ఇప్పటికే పశ్చిమాసిలోయా ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి టైంలో అమెరికా దళాలు అక్కడ చేరడంతో పరిస్థితులు మరింత తీవ్రతరం కానున్నాయి. మరోవైపు, గాజాలో యుద్ధం మొదలైన నాటినుంచి హూతీ రెబల్స్‌ ఎర్ర సముద్రంలోని నౌకలపై దాదాపు 100 వరకు డ్రోన్‌, క్షిపణి దాడులను నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed