- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
దిశ, వెబ్ డెస్క్ : సమస్య ఏదైనా సీఎం రేవంత్ రెడ్డిపై ట్వీట్ల విమర్శలు సంధించడం నిత్యకృత్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రేవంత్ ఢిల్లీ పర్యటనపై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల వల్ల పైసా పనిలేదు.. రాష్ట్రానికి రూపాయి లాభం లేదని సెటైరికల్ కామెంట్లతో విరుచుకుపడ్డారు. 10 నెలల్లో 25 సార్లు 50రోజుల పాటు పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివని, తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదని విమర్శించారు. అయినను పోయి రావాలె హస్తినకు అంటూ మండిపడ్డారు.
అన్నదాతల అరిగోసలు.. గాల్లో దీపాల్లా గురుకులాలు..కుంటుపడ్డ వైద్యం..గాడి తప్పిన విద్యా వ్యవస్థ..అయినను పోయి రావాలె హస్తినకు అని, మూసీ పేరుతో , హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టి 420 హామీలను మడతపెట్టి మూలకు వేసి అయినను పోయి రావాలె హస్తినకు అంటూ కవితాత్మక విమర్శలు చేశారు. పండగలు పండగళ్ళా లేవని, ఆడబిడ్డల చీరలు అందనేలేదని, అవ్వాతాతలకు అనుకున్న పింఛను లేదని, తులం బంగారం జాడనే లేదని, స్కూటీలు లేవు, కుట్టు మిషిన్లు లేవని, అయినను పోయి రావాలె హస్తినకు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లను కేటీఆర్ తప్పుబట్టారు.