చలికాలంలో ఆరోగ్యాన్ని ఇచ్చే శృంగారం.. ఆ చాన్స్ వస్తే అస్సలు వదలకండి

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-11-25 10:19:06.0  )
చలికాలంలో ఆరోగ్యాన్ని ఇచ్చే శృంగారం.. ఆ చాన్స్ వస్తే అస్సలు వదలకండి
X

దిశ, వెబ్‌డెస్క్: చలికాలం వచ్చిందంటే చాలు.. చిన్నాపెద్ద అందరూ ముడుచుకుపోతారు. వెచ్చదనం కోసం దుప్పట్ల నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు. వీళ్ల పరిస్థితి ఎలా ఉన్నా.. కపుల్స్‌కు ఈ వింటర్ సీజన్ ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. వేసవి, వర్షాకాలం కంటే శీతాకాలంలో రొమాన్స్ ఎక్కువగా చేయవచ్చంటున్నారు. ఈ కాలంలో శృంగార కోరికలు సైతం మిగతా సీజన్ల కంటే ఎక్కువగానే ఉంటాయని సెక్సాలజిస్టులు పేర్కొంటున్నారు. అంతే కాదు అందాన్ని పెంచడంతోపాటు అనారోగ్య సమస్యలను దరి చేరనీయవని చెబుతున్నారు. ఈ చలికాలంలో తరచూ శృంగారం చేసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

చలికాలంలో సెక్స్ కోరికలు అధికమవుతాయి. వెచ్చదనం కోసం కపుల్స్ దుప్పట్లో దూరినా ఒకరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోతారు. ఈ క్రమంలో విడుదలయ్యే హార్మోన్స్ ఇద్దరిలో శృంగార కోరికలు పెంచుతాయి. హుషారుగా సెక్స్ చేయడానికి దోహదపడతాయి. నిత్యం శృంగారం చేసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. జలుబు, ముఖంపై వచ్చే ముడుతలు రాకుండా శృంగారం అడ్డుకునే చాన్స్ ఉంది. చర్మం కాంతివంతంగా మెరుపునిస్తుంది. డిఫ్రెషన్‌కు గురి కాకుండా దోహదపడుతుంది.

మహిళల్లో రుతుక్రమ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మెటిమలను నివారిస్తుంది. రోజంతా యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుంది. సెక్స్ ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది. ఎండ నుంచి వచ్చే విటమిన్ డీ శక్తి శృంగారంలో పాల్గొనడం ద్వారా లభిస్తుంది. పురుషులలో స్పెర్మ్ కౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సంతాన లేమి సమస్యలతో బాధపడే దంపతులు తప్పకుండా చలికాలంలో శృంగారాన్ని మరవద్దని గైనకాలాజిస్టులు చెబుతున్నారు. అందుకే ఈ చలికాలంలో కపుల్స్ శృంగారం చేసుకునే చాన్స్ వస్తే అస్సలు మిస్ కావద్దని డాక్టర్లు చెబుతున్నారు.

గమనిక: పై సమచారం ఇంటర్ నెట్‌లో వైద్య నిపుణులు అందించిన అభిప్రాయాల మేరకు ఇవ్వనైనది. పై కథననాన్ని ‘దిశ’ ధృవీకరించడం లేదు. మీమీ ఆరోగ్య, శృంగార సమస్యలకు వైద్యులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed