ముంబై ఇండియన్స్‌కి భారీ ప్రైజ్ మనీ.. పాక్ సూపర్ లీగ్ కంటే డబుల్

by Vinod kumar |
ముంబై ఇండియన్స్‌కి భారీ ప్రైజ్ మనీ.. పాక్ సూపర్ లీగ్ కంటే డబుల్
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తొలి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ప్రపంచంలో అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరోసారి ప్రపంచానికి తన సత్తా చాటింది. ఈ ఏడాది బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు రూ. 6 కోట్ల ప్రైజ్ మనీని అందించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ (రూ. 3.4 కోట్లు) కంటే ఇది దాదాపు రెట్టింపు. డబ్ల్యూపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజేతల్లో సగం (రూ. 3 కోట్లు) ప్రైజ్ మనీ దక్కింది.

ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో ముంబై.. 19.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వివధ దేశాలలోని ఉమెన్స్ క్రికెట్ లీగ్‌లతో పాటు చాలా దేశాల్లో జరుగుతున్న మెన్స్ ఫ్రాంచైజీ లీగ్‌‌ల కంటే డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు దక్కిన క్యాష్ ప్రైజే ఎక్కువ. ఈ జాబితాలో ఐపీఎల్ నెంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. గతేడాది ఐపీఎల్ విజేతగా గెలిచిన గుజరాత్ టైటాన్స్‌కు రూ. 20 కోట్ల క్యాష్ ప్రైజ్ అందగా రన్నరప్ రాజస్తాన్ రాయల్స్‌కు రూ. 13 కోట్లు దక్కాయి.

1. ఐపీఎల్ - రూ. 20 కోట్లు

2. ఎస్ఎ20 లీగ్ - రూ. 15 కోట్లు

3. కరేబియన్ ప్రీమియర్ లీగ్ - రూ. 8 కోట్లు

4. డబ్ల్యూపీఎల్ - రూ. 6 కోట్లు

5. ఐఎల్ టీ20 - రూ. 5.7 కోట్లు

6. పీఎస్ఎల్ - రూ. 3.4 కోట్లు

7. బిగ్ బాష్ లీగ్ - రూ. 2.7 కోట్లు

8. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ - రూ. 2.7 కోట్లు

9. బంగ్లా ప్రీమియర్ లీగ్ - రూ. 1.53 కోట్లు

10. ఉమెన్స్ హండ్రెడ్ (ఇంగ్లాండ్) - రూ. 1.5 కోట్లు

11. మెన్స్ హండ్రడె - రూ. 1.5 కోట్లు

12. లంక ప్రీమియర్ లీగ్ - రూ. 82 లక్షలు

Advertisement

Next Story