- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను మెరుగైన టీ20 బౌలర్‌గా మార్చింది ధోనీనే : సీఎస్కే పేసర్
దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్(సీఎస్కే) పేసర్ సిమర్‌జీత్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో సత్తాచాటుతున్నాడు. నార్త్ ఢిల్లీ రైడర్స్‌కు ఆడుతున్న అతను 15 వికెట్లతో సెకండ్ టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. సిమర్‌జీత్ సింగ్, శ్రీలంక సంచలనం పతిరణ, తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్ వంటి సీఎస్కే బౌలర్లు ధోనీ నాయకత్వంలో రాటుదేలినవాళ్లే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిమర్‌జీత్ సింగ్.. ధోనీపై ప్రశంసలు కురిపించాడు.
తాను మెరుగైన టీ20 బౌలర్‌గా ఎదగడంలో ధోనీది కీలక పాత్ర ఉందన్నాడు. ‘నేను మెరుగైన టీ20 బౌలర్‌గా మార్చడానికి ధోనీ సహకరించాడు. అతను నా గురించి చాలా ఆలోచించేవాడు. నాకు చాలా విషయాల్లో సహాయం చేశాడు. ఆట గురించి ధోనీని చాలా అడిగేవాళ్లం. సాధారణ క్రికెట్ ఆడటం ఉత్తమ మార్గమని చెప్పేవాడు. ఆటకు సంబంధించిన విషయాలను సులభతరం చేసేవాడు.’ అని తెలిపాడు. అలాగే, ఐపీఎల్ మెగా వేలం గురించి స్పందిస్తూ.. ‘నన్ను ఏ జట్టు ఎంపిక చేసుకున్నా ఆ జట్టు విజయాలకు సహకరిస్తా. క్రికెటర్‌గా ఎదగడమే నా లక్ష్యం.’ అని చెప్పుకొచ్చాడు.