ఇంటర్ మియామితో మెస్సీ ఒప్పందం..

by Vinod kumar |
ఇంటర్ మియామితో మెస్సీ ఒప్పందం..
X

న్యూఢిల్లీ : దిగ్గజ ఫుట్‌బాలర్, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ అమెరికాకు చెందిన ఫుట్‌బాల్ క్లబ్‌ ఇంటర్ మియామి‌లో చేరనున్నాడు. మెస్సీ తమ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఇంటర్ మియామి గురువారం అధికారికంగా వెల్లడించింది. ట్విట్టర్ వేదికగా ఓ వీడియో పోస్టు చేసింది. మెస్సీ సైతం ఈ ఒప్పందంపై స్పెయిన్ మీడియాతో ధ్రువీకరించాడు. పారిస్ సెయింట్ జెర్మైన్‌తో ఇటీవల అతని రెండేళ్ల ఒప్పందం ముగిసిన విషయం తెలిసిందే.

దాంతో మెస్సీతో ఒప్పందం చేసుకునేందుకు పలు ఫుట్‌బాల్ క్లబ్‌లు ఆసక్తి చూపించాయి. ముఖ్యంగా సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్, స్పెయిన్ క్లబ్ బార్సిలోనా భారీగా ఆఫర్ చేసినట్టు తెలిసింది. అయితే, మెస్సీ అమెరికా ఫుట్‌బాల్ క్లబ్ ఇంటర్ మియామిలో చేరడానికే మొగ్గు చూపాడు. కాగా, ఒప్పందంలో భాగంగా క్లబ్‌ ఓనర్‌షిప్‌లో మెస్సీ వాటా పొందనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story