- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL: రిటెన్షన్‌లో సంచలనం.. ధోనికి కేవలం 4 కోట్లు మాత్రమే
దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్(IPL) ప్లేయర్ల రిటెన్షన్(Retention) లిస్టులను బీసీసీఐ(BCCI)కి అందించారు. కాగా ఈ లిస్టులో చెన్నై(CSK) జట్టు కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. మొత్తం ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్న చెన్నై జట్టు.. అత్యధికంగా యువ బ్యాటర్ తుర్‌రాజ్ గైక్వాడ్ కు 18 కోట్లు, రవీంద్ర జడేలకు 18 కోట్లు, శ్రీలంక యువ బౌలర్ మతీశ పతిరణకు రూ. 14 కోట్లు, శివమ్ దుబే కు రూ. 12 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. అయితే ఇన్ని రోజులు చెన్నై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి పలుమార్లు కప్పులు అందించిన మహేంద్రసింగ్ ధోని(Mahendra Singh Dhoni)కి మాత్రం కేవలం రూ. 4 కోట్లు మాత్రమే చెల్లించింది. దీనికి ప్రధాన కారణం ఇటీవల ఐపీఎల్(IPL) గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయమే కారణం. ఇటీవల బీసీసీఐ(BCCI) ఐపీఎల్ రూల్స్‌లో పలు మార్పులు చేయగా.. అన్ క్యాపుడ్ ప్లేయర్లకు ఇచ్చే మొత్తంపై పరిమితిని విధించారు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీకి చెన్నై జట్టు కేవలం రూ. 4 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. చెన్నై జట్టు రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్లకు అయిన మొత్తం రూ. 65 కోట్లు కాగా.. ఈ డిసెంబర్ లో జరిగే వేలం కోసం ఆ జట్టు వద్ద రూ. 51 కోట్లు ఉన్నాయి.