- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేకేఆర్ జట్టులోకి శ్రీలంక స్టార్ పేసర్.. చమీరాను ఎంతకు కొనుగోలు చేసిందంటే?
దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక పేసర్ దుష్మంత చమీరా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇంగ్లాండ్ పేసర్ గుస్ అట్కిన్సన్ ఈ సీజన్ నుంచి వైదొలగడంతో అతని స్థానంలో చమీరాను కేకేఆర్ ఫ్రాంచైజీ జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు సోమవారం ధ్రువీకరించారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో అట్కిన్సన్‌ను కేకేఆర్ రూ. కోటి వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే, అతను లీగ్ నుంచి తప్పుకోవడానికి నిర్దిష్ట కారణం తెలియరాలేదు. అతని స్థానాన్ని కేకేఆర్ చమీరాతో భర్తీ చేసింది. చమీరాతో ఫ్రాంచైజీ రూ.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్టు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.
చమీరా రాకతో కేకేఆర్ పేస్ దళం బలోపేతమైందనే చెప్పాలి. గతంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించినా బెంచ్‌కే పరిమితమయ్యాడు. 2022లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసుకున్నాడు. గాయం కారణంగా గతేడాది లీగ్‌లో పాల్గొనలేదు. మినీ వేలంలో చమరీ రూ. 50 లక్షల కనీస ధరతో పాల్గొనగా.. అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఇటీవల ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో దుబాయ్ క్యాపిటల్స్ తరపున చమరీ రాణించాడు. 7 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రూ. 50 లక్షల బేస్ ప్రైజ్‌కే అతనితో కోల్‌కతా ఒప్పందం చేసుకుంది.
మరోవైపు, 2012, 2014 సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత మరో టైటిల్ కోసం ఆ జట్టుకు ఎదురుచూపులు తప్పడం లేదు. గత రెండు సీజన్లలో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేదు. గత సీజన్‌లో గాయం కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లీగ్ మొత్తానికి దూరమవ్వగా.. ఈ సీజన్‌లో అతను అందుబాటులో రానున్నాడు.