నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించాలి : ఎస్పీ అశోక్ కుమార్

by Aamani |
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించాలి : ఎస్పీ అశోక్ కుమార్
X

దిశ, జగిత్యాల టౌన్ : రాబోయే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు, పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అన్ని పోలీస్ స్టేషన్ ల పనితీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గడిచిన 12 నెలల్లో పోలీస్ స్టేషన్ల పనితీరు, కేసుల చేదనలో సాధించిన పురోగతిని అంచనా వేసుకుంటూ రానున్న సంవత్సరంలో మరింత దృడ నిశ్చయంతో పని చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరించి కేసుల సంఖ్య తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

డీఎస్పీలు, సిఐలు తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లలో నమోదైన వివిధ రకాల కేసులు స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్ఐలకు సూచనలు ఇవ్వాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్ట బందోబస్తు, పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం తో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చూడాలని తెలిపారు. అనంతరం గత సంవత్సరం శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీలు రవీంద్ర కుమార్, రాములు, రంగారెడ్డి, డీసీఆర్బీ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, సిఐలు వేణుగోపాల్, రామ్ నరసింహారెడ్డి, రవి, సురేష్, నిరంజన్ రెడ్డి, ఆర్ ఐ కిరణ్ కుమార్, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed