Constable suicide: తీవ్ర విషాదం.. ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

by Gantepaka Srikanth |
Constable suicide: తీవ్ర విషాదం.. ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: మెదక్(Medak) జిల్లా కొల్చారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌(Police Headquarters) ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని కానిస్టేబుల్ సాయి(Constable Sai) ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయాన్నే గమనించిన తోటి పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, డిపార్ట్‌మెంట్‌లో వరుస ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. కామారెడ్డిలో ముగ్గురు పోలీసుల ఆత్మహత్యల ఘటన మరువకముందే మరో చోట కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed